చంద్రబాబు నాయకత్వం… ఈ రాష్ట్రానికి అవశ్యం

జిఎస్‌ఎల్‌, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌, స్పందన ఆధ్వర్యంలో ముగిసిన దంత వైద్య శిబిరం
గన్ని కృష్ణ సామాజిక సేవలకు ఉప ముఖ్యమంత్రి రాజప్ప తదితర ప్రముఖుల ప్రశంసలు
రాజమహేంద్రవరం, ఏప్రిల్‌ 20 : దార్శనికత, సమర్ధతతో జన హితమే తన అభిమతంగా నిర్విరామంగా పనిచేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు నాయకత్వం సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమని, ఆయన నిండు నూరేళ్ళు జీవించి రాబోయే రోజుల్లో కూడా ముఖ్యమంత్రిగా కొనసాగితే ఆంధ్రప్రదేశ్‌ అగ్రగామిగా రూపొందుతుందని ఉప ముఖ్యమంత్రి, హోంశాఖామాత్యులు నిమ్మకాయల చినరాజప్ప అన్నారు. విద్యార్ధి దశ నుంచి నాయకత్వ లక్షణాలు అలవరుచుకుని ఈ రాష్ట్రానికి  దిశా, దశ నిర్ధేశిస్తున్న చంద్రబాబు కృషితోనే కట్టుబట్టలతో రోడ్డున పడ్డ ఆంధ్రప్రదేశ్‌కు ఇప్పుడిప్పుడే మంచిరోజులు వస్తున్నాయని, ఆయన నాయకత్వం ఎంతకాలం కొనసాగితే రాష్ట్రానికి అంత ప్రయోజనకరమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు జన్మదినోత్సవం సందర్భంగా జిఎస్‌ఎల్‌ డెంటల్‌ కాలేజీ, ఆసుపత్రి, ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌ సహకారంతో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ వ్యవస్థాపకులు అధ్యక్షులుగా ఉన్న స్పందన స్వచ్చంద సేవా సంస్థ నిర్వహించిన దంత వైద్య శిబిరం ముగింపు కార్యక్రమంలో రాజప్ప  ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం, ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, మేయర్‌ పంతం రజనీ శేషసాయి, కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు,  ఆర్యాపురం బ్యాంక్‌ చైర్మన్‌ చల్లా శంకరరావు, జిఎస్‌ఎల్‌ డెంటల్‌ కాలేజీ వ్యవస్థాపకులు డాక్టర్‌ గన్ని భాస్కరరావు తదితర ప్రముఖులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో రాజప్ప మాట్లాడుతూ గన్ని కృష్ణ సమాజ సేవలను బహుదా ప్రశంసించారు. నవ్యాంధ్ర రాజధాని అమరావతి, బహుళార్ధక సాధక పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణమే ధ్యేయంగా పేదల సంక్షేమానికి రోజుకు పది గంటలు పైగా శ్రమిస్తున్న సీఎం చంద్రబాబు ఆశయాలు, ఆకాంక్షలకనుగుణంగా తెదేపా శ్రేణులంతా పనిచేయాలని పిలుపునిచ్చారు. ముఖ్యమంత్రి చేపడుతున్న కార్యక్రమాలు భవిష్యత్‌ తరాలకు ఎంతో ఉపయుక్తపడతాయని, అందులో భాగంగా నీరు – ప్రగతి కార్యక్రమం ద్వారా భూగర్భ జలాలను పెంపొందించడానికి, మొక్కలు నాటి హరితాంధ్రప్రదేశ్‌ను నిర్మించేందుకు దోహదపడుతుందన్నారు. రాజకీయ నాయకుల శైలికి భిన్నంగా తన జన్మదినోత్సవాన్ని సమాజానికి ఉపయుక్తపడేలా కార్యక్రమాలను నిర్వహించేలా పార్టీ యంత్రాంగానికి దిశా నిర్ధేశం చేసిన చంద్రబాబు అందరికీ ఆదర్శప్రాయులన్నారు. శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ ప్రతి క్షణం పేద ప్రజల సంక్షేమం, రాష్ట్రాభ్యున్నతి గురించి ఆలోచించే చంద్రబాబునాయుడు నాయకత్వం సంక్షోభంలో ఉన్న ఈ రాష్ట్రానికి ఎంతో అవసరమన్నారు. పోలవరం ప్రాజెక్ట్‌, అమరావతి నిర్మాణానికి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి చరిత్రలో నిలిచిపోతుందన్నారు. కార్యక్రమ నిర్వాహకులు, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గన్ని కృష్ణ మాట్లాడుతూ ఈ రాష్ట్ర ప్రజల మోముల్లో  నవ్వులు చూడాలన్న భావనతో సీఎం చంద్రబాబు పనిచేస్తున్నారని, ఆ నవ్వులు ఆరోగ్యంగా, అందంగా ఉండాలనే ఆశయంతో చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ దంత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశామని చెప్పారు. ప్రతి ఏటా చంద్రబాబు జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం తాను లక్ష్యంగా నిర్ధేశించుకున్నానని, అందులో భాగంగా ఓ గిరిజన గ్రామాన్ని దత్తత తీసుకుని అక్కడ అభివృద్ధి పనులు చేపట్టామని, అలాగే ఆపదలో ఉన్న వారికి అవసరమయ్యే రక్తాన్ని సేకరించేందుకు రక్తదాన శిబిరాలు నిర్వహిస్తున్నామని, సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా పేదలకు సేవ చేస్తే జన్మ ధన్యమవుతుందన్న తమ అధినేత  చంద్రబాబు సూచన మేరకు ఈ దంత వైద్య శిబిరాన్ని నిర్వహించామని గన్ని చెప్పారు. దంత చికిత్స, కొత్త దంతాల అమరిక వంటి కార్యక్రమాలకు సుమారు రూ.కోటి వ్యయమవుతోందని, తాము తలపెట్టిన ఈ సేవా కార్యక్రమానికి సహకరించిన జి.ఎస్‌.ఎల్‌. ఆసుపత్రి, కాలేజీ, దంత వైద్య కళాశాల, ఆసుపత్రి చైర్మన్‌, తన సోదరుడైన గన్ని భాస్కరరావుకు గన్ని కృష్ణ కృతజ్ఞతలు తెలియజేశారు. అలాగే సహకరించిన ఎన్‌టిఆర్‌ ట్రస్ట్‌కు కూడా ఆయన తన కృతజ్ఞతలు తెలియజేశారు.శాసనమండలి సభ్యులు ఆదిరెడ్డి అప్పారావు మాట్లాడుతూ ఆర్థికంగా అనేక కష్టాలు ఉన్నా ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు, రాజధాని, పోలవరం ప్రాజెక్ట్‌ నిర్మాణానికి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి మరువలేనిదన్నారు. విద్యార్ధి దశ నుంచే నాయకత్వ లక్షణాలు అందిపుచ్చుకుని 27 సంవత్సరాలకే ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రి పదవి చేపట్టి వివిధ హోదాలలో ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధికి చంద్రబాబునాయుడు చేస్తున్న కృషి అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు. క్రమశిక్షణ, నిబద్ధత, దార్శనికత, సమర్ధత కలిగిన చంద్రబాబునాయుడు నాయకత్వం లభించడం ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు చేసుకున్న అదృష్టమని ఆదిరెడ్డి అన్నారు. ప్రతిభే పెట్టుబడిగా, సామర్ధ్యమే గీటురాయిగా అటు తెలుగుదేశం పార్టీలో, ఇటు రాష్ట్రంలో ఎన్ని ఆటుపోటులు ఎదురైనా వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొని రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తున్న దక్షత గల నేత చంద్రబాబు అని ఆయన పేర్కొన్నారు. చంద్రబాబు నాయకత్వం ఈ రాష్ట్రానికి ఎంతో అవసరం ఉన్నందున ఆయన మరెన్నో జన్మదినోత్సవాలు జరుపుకుని ముఖ్యమంత్రిగా ఉండాలన్నారు. నగర మేయర్‌ పంతం రజనీ శేషసాయి మాట్లాడుతూ తన దార్శనికతతో ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్తున్న చంద్రబాబు నాయకత్వం కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు రాబోయే రోజుల్లో కూడా ఎంతో అవసరమని, అందుకు ఆయన ఆయురారోగ్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. కాపు కార్పొరేషన్‌ డైరెక్టర్‌ యర్రా వేణుగోపాలరాయుడు మాట్లాడుతూ చంద్రబాబునాయుడును నిరంతర శ్రామికుడిగా అభివర్ణించారు. దక్షత గల ఆయన నాయకత్వం కష్టాల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు ఎంతో అవసరమన్నారు. ఈ కార్యక్రమంలో రుంకాని వెంకటేశ్వరరావు, పాలిక శ్రీను, కురగంటి సతీష్‌, రెడ్డి మణి, మజ్జి పద్మ, కప్పల వెలుగుకుమారి తదితరులు ప్రసంగించారు. అనంతరం షాదీఖానా స్థలంలో పార్టీ పిలుపు మేరకు ఇంకుడుగుంతను రెడ్డి సుబ్రహ్మణ్యం తవ్వారు. షాదీఖానాలో ఏర్పాటు చేసిన దంత వైద్య శిబిరాన్ని, డెంటల్‌ ఎగ్జిబిషన్‌ను ముఖ్యఅతిధులు నాయకులు పరిశీలించారు. అతిధుల చేతులమీదుగా పళ్ళ సెట్లను రోగులకు అందజేశారు. పాఠశాల విద్యార్ధులకు, రోగులకు దంత వైద్యానికి సంబంధించిన కిట్లను పంపిణీ చేశారు. జిఎస్‌ఎల్‌ డెంటల్‌ కాలేజీ ప్రిన్సిపాల్‌ సునీల్‌, ఆసుపత్రి వైద్యులు రాజేంద్రప్రసాద్‌, సాయికిరణ్‌, సుదర్శన్‌, రమ్య, లావణ్య, మాణిక్యం, పవిత్ర, హరికృష్ణ, గౌతమ్‌, రవీణ్‌, చంద్రబాబు, శ్రీకాంత్‌, ప్రవీణ, 150 మంది దంత వైద్య విద్యార్ధులు సేవలందించారు. దళితరత్న కాశి నవీన్‌కుమార్‌, ఫ్లోర్‌ లీడర్‌ వర్రే శ్రీనివాసరావు, రెడ్డి రాజు,  మజ్జి రాంబాబు, చిట్టూరి ప్రవీణ్‌చౌదరి, తవ్వా రాజా, కార్పొరేటర్లు బెజవాడ రాజ్‌కుమార్‌, కురగంటి ఈశ్వరి, మజ్జి పద్మ, గొందేశి మాధవీలత, తంగేటి వరలక్ష్మి, కడలి రామకృష్ణ, కోరుమిల్లి విజయశేఖర్‌, కోసూరి చండీప్రియ, తంగేటి వరలక్ష్మి, కిలపర్తి శ్రీనివాస్‌, మాటూరి రంగారావు, బూర దుర్గాంజనేయరావు, రెడ్డి పార్వతి, తంగెళ్ళ బాబి, మర్రి దుర్గా శ్రీనివాస్‌, మళ్ళ నాగలక్ష్మి, కంటిపూడి పద్మావతి, గరగ పార్వతి, కప్పల వెలుగుకుమారి, పార్టీ నాయకులు మళ్ళ వెంకట్రాజు, అరిగెల బాబూ నాగేంద్రప్రసాద్‌, ఉప్పులూరి జానకిరామయ్య, యర్రమోతు ధర్మరాజు, పితాని కుటుంబరావు, బుడ్డిగ రవి, బొమ్మనమైన శ్రీనివాస్‌, బిక్కిన రవికిషోర్‌, ఆళ్ళ ఆనందరావు, శీలం గోవింద్‌, తలారి భాస్కర్‌, కాశి విశ్వనాధ్‌, విశ్వనాధరాజు, సూరంపూడి శ్రీహరి, జాలా మదన్‌, పైలా రాంబాబు, చిన్నారి ఉమామహేశ్వరరావు, కర్రి రాంబాబు, కంటిపూడి శ్రీనివాస్‌, నందిన వెంకట ప్రసాదరావు, రొంపిచర్ల ఆంథోని, దాలిపర్తి వేమన, ఎం.వి.డి.భాస్కర్‌, మాకాని లక్ష్మణరావు, చంద్రశేఖరనాయుడు, దమర్‌సింగ్‌ బ్రహ్మాజీ, కాకర్ల సుజన, బెజవాడ వెంకటస్వామి, నరాల రమణమూర్తి, హుస్సేన్‌ ఆలీ జానీ, బొట్టా రమణ పాల్గొన్నారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, హోం మంత్రి రాజప్ప సందర్భంగా భద్రతా ఏర్పాట్లను అడిషినల్‌ ఎస్పీ ఆర్‌.గంగాధర్‌ నేతృత్వంలో డిఎస్పీలు కులశేఖర్‌, త్రినాధరావు, భరత్‌ మాతాజీ పర్యవేక్షించారు.
67 కేజీల కేక్‌ కట్‌ చేసిన రాజప్ప
చంద్రబాబు 67 సంవత్సరాలు పూర్తిచేసుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని 67 కేజీల భారీ కేక్‌ను రాజప్ప కట్‌ చేశారు. కాగా ఈ సందర్భంగా మాజీ చీప్‌ విప్‌ రెడ్డి మణేశ్వరరావు ఆధ్వర్యంలో పలువురు యువకులు తెలుగుదేశం పార్టీలో చేరారు. కార్యక్రమం అనంతరం ఉప ముఖ్యమంత్రి రాజప్ప, శాసనమండలి డిప్యూటీ చైర్మన్‌ రెడ్డి సుబ్రహ్మణ్యం సోమాలమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు.