పొటోగ్రాఫర్‌ కుటుంబానికి ఆర్ధిక సాయం

రాజమహేంద్రవరం,  ఏప్రిల్‌ 29 :  కోరుకొండకు చెందిన ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్‌ జి. శాంతారామ్‌ ఆకస్మిక మృతికి రాజమండ్రి జోన్‌ ప్రొఫెషనల్‌ ఫొటోగ్రాఫర్స్‌ అసోసియేషన్‌ స్పందించింది. అనాధలైన భార్య, ఇద్దరు పిల్లలకు ఓదార్పునివ్వడంలో భాగంగా వారి కుటుంబానికి రూ. 31,300 ఆర్ధిక సాయాన్ని అందజేశారు. ఇంటి యజమాని కోల్పోయిన ఆ కుటుంబానికి ప్రభుత్వం ద్వారా వచ్చు ఆర్ధిక సాయాన్ని ఆసరా పథకాన్ని అమలుచేయాలని రాజానగరం ఎమ్మెల్యే పెందుర్తి వెంకటేష్‌ను అసోసియేషన్‌ కోరింది. ఈ సాయాన్ని సంఘ గౌరవాధ్యక్షులు, జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్‌ అల్లు బాబిచే అందజేయించారు. సంఘ అధ్యక్ష కార్యదర్శులు కేతా శ్రీనివాస్‌, వానపల్లి బాబి, కోశాధికారి సిరి శ్రీను, సభ్యులు గోకవరం బాబులు, కోరుకొండ రాజు, రాజానగరం లాజరు, చిట్టిబాబు,  ప్రసాద్‌, ఎపి నారాయణరావు, బుజ్జి, గుండు మురళి, షణ్ముఖ్‌, సీతానగరం ఏసుపాదం, చిన్ని, కొమారపు ఆనంద్‌, గంగాధర్‌, తదితరులు పాల్గొని కుటుంబానికి భరోసాగా ఉంటామని హామీ ఇచ్చారు.