గన్ని కృష్ణకు అభినందనల వెల్లువ

 
రాజమహేంద్రవరం, జూన్‌ 12 : గుడా చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గన్ని కృష్ణకు పలు సంస్థల ప్రతినిధులు, రాజకీయ పార్టీల నాయకులు అభినందనలు తెలిపారు. కాటన్‌ నర్సరీ మెన్‌ అసోసియేషన్‌ అధ్యక్షులు పుల్లా సత్యనారాయణ (చంటి), కార్యవర్గ సభ్యులు ఆకుల శివ, పుల్లా రామకృష్ణ, కడియం మండలం తెదేపా నాయకులు కొత్తూరి బాల నాగేశ్వరరావులు గన్ని కృష్ణను కలిసి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. 2వ డివిజన్‌ కార్పొరేటర్‌ పితాని లక్ష్మీకుమారి, నాయకులు కుటుంబరావు ఆధ్వర్యంలో డివిజన్‌ తెదేపా నాయకులు పెద్ద ఎత్తున గన్ని కార్యాలయానికి చేరుకుని ఆయనను ఘనంగా సత్కరించారు. బేసిక్‌ మెడికల్‌ ప్రాక్టీషనర్స్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కార్పొరేటర్‌ కొమ్మ శ్రీనివాసరావు ఆధ్వర్యంలో గన్ని నివాసానికి చేరుకుని మొక్క అందించి ఆయనను సత్కరించారు. శ్రీ గౌతమి పబ్లిక్‌ స్కూల్‌ అధినేతలు సుంకర సూర్య ప్రకాశరావు, సుంకర రవికుమార్‌లు గన్ని కృష్ణను కలిసి శుభాకాంక్షలు తెలిపారు. చర్చిపేట ఎదురుగా ఉన్న సెయింట్‌పాల్స్‌ లూధరన్‌ చర్చ్‌ పాస్టర్‌ రెవ.జి.జె.మోజెస్‌, దళిత సంఘాల నాయకులు తుత్తరపూడి రమణ, వెంట్రపాటి వీర్రాజు, దొండపాటి క్రిష్టాఫర్‌లు పూలబొకే అందించి గన్నికి అభినందనలు తెలిపారు. తెలుగుదేశం పార్టీ మహిళా నాయకురాండ్రు మాలే విజయలక్ష్మి, చుండ్రు భాగ్యలక్ష్మి, తురకల నిర్మల, రాయపాటి శ్యామల, శిరిగి బాల సరస్వతి, ముమ్మిడి లక్ష్మి, అడబాల నాగమణి, రాయపాటి రవిచంద్ర, కారుమూరి శాంతి, తదితరులు గన్నిని కలిసి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు.