గుడా చైర్మన్‌  గన్ని కృష్ణను కలిసిన కేశన శంకరరావు

రాజమహేంద్రవరం, జూన్‌ 13 : గోదావరి అర్బన్‌ డెవలప్‌మెంట్‌ అథారిటీ (గుడా) చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన గన్ని కృష్ణను బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేశన శంకరరావు ఈరోజు మర్యాద పూర్వకంగా కలిశారు. పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. గుడా తొలి చైర్మన్‌గా నియమితులవ్వడం ఆనందంగా ఉందని, అందరి ఆకాంక్షలకు అనుగుణంగా అభివృద్ధి చేయాలని ఆకాంక్షించారు. శంకరరావు వెంట రాష్ట్ర జెఏసీ కన్వీనర్‌ మార్గాని నాగేశ్వరరావు, రాష్ట్ర కో-ఆర్డినేటర్‌ మార్గాని రామకృష్ణగౌడ్‌, నగర అధ్యక్షులు మజ్జి అప్పారావు, దొమ్మేటి సోమశంకరం, గోలి రవి, కొమాండూరి కుమారి, సుభాషిణి తదితరులు పాల్గొన్నారు.