గన్ని కృష్ణకు అలయన్స్‌ క్లబ్‌ సత్కారం

రాజమహేంద్రవరం, జూన్‌ 13 : గుడా చైర్మన్‌ గన్ని కృష్ణను అలయన్స్‌ క్లబ్‌ ప్రతినిధులు ఘనంగా సత్కరించారు. అలయన్స్‌ క్లబ్‌ గవర్నర్‌ టి.ఎస్‌.ఎన్‌.రెడ్డి, వైస్‌ గవర్నర్‌ కొయ్యాన కుమారి తదితరులు గన్ని కార్యాలయానికి చేరుకుని దుశ్శాలువాతో ఆయన సత్కరించి పూలబొకే అందించి శుభాకాంక్షలు తెలిపారు. మరిన్ని పదవులు అధిరోహించాలని వారు ఆకాంక్షించారు.